సాయి వాణి :విశ్వాసం తో నన్ను నమ్ము. నిన్ను అన్ని వైపుల నుండి రక్షించేదను . నాపై నమ్మకం కలవారికి జయము కలుగును.

కాకడ ఆరతి (తెలుగు అర్థము తో)

5. ఘేవునియా పంచారతీ – కరూ బాబాంసీ ఆరతీ

కరూ సాయీసీ ఆరతీ – కరూ బాబాంసీ ఆరతీ ||

ఉఠా ఉఠా హో బాంధవ – ఓవాళూ హా రఖుమాధవ!

సాయీ రమాధవా | ఓ వాళూ హా రఖుమాధవ ||

కరూనియా స్థిర మన – పాహు గంభీర హే ధ్యాన

సాయీ చే హే ధ్యాన! పాహు గంభీర హే ధ్యాన ||

కృష్ణనాధా దత్తసాయీ – జడో చిత్త తుయే పాయీ |

చిత్త దేవా పాయీ | జడో చిత్త తుఝే  పాయీ ||

అర్ధము : 1. సాయిబాబా నీకు అయిదు వత్తుల పంచారతి నిచ్చెదము. 2. బంధువులారా లెండి ! లెండి ! మన సాయికి హారతి నిచ్చెదము రండి. 3. మనసులో భక్తిని స్థిరపరచి సాయి ధ్యానము చేయుదము. 4. కృష్ణ, దత్తావతార రూపుడవైన ఓ సాయి మా మనసులు నీ కర్పిస్తున్నాము.

6. కాకడ ఆరతీ కరీతో – సాయినాధ దేవా |

చిన్మయరూప దాఖవీ ఘేవుని – బాలక లఘుసేవా ||

కామ క్రోధ మద మత్సర ఆటునీ – కాకడా కేలా |

వైరాగ్యాచే తూప ఘాలునీ మీ తో బిజవీలా

సాయినాధ గురుభక్తి జ్వలనే – తో మీ పేటవిలా

తద్వత్తీ జాళునీ గురూనే – ప్రకాశ పాడిలా |

ద్వైతతమా నాసూనీ మిళవీ – తత్స్వరూపీజీవా

చిన్మయరూప దాఖవీ ఘేవుని – బాలకలఘు సేవ ||   

                                                                ||కా|| –

భూ-ఖేచర వ్యాపూనీ అవఘే హృత్కమలీరాహసీ

తోచి దత్తదేవ శిరిడీ రాహుని పావసీ |

రాహుని యేధే అన్యత్రహి తూ – భక్తాంస్తవధావసీ

నిరసునియా సంకట దాసా – అనుభవ దావీసీ |

న కళే త్వల్లీలాహీ కోణ్యా దేవా వా మానవా

చిన్మయరూపదాఖవీ ఘేవుని బాలకలఘు సేవ!

                                                            ||కా||

త్వద్యశ దుందుభీనే సారే – అంబర్ హే కోందలే

సగుణ మూర్తి పాహణ్యా – ఆతుర జన షిరిడీ ఆలే |

ప్రాశునిత్వద్వచనామృత ఆముచే దేహభాన హరపలే

సోడూనియా దురభిమాన మానస – త్వచ్చరణీ వాహిలే ,

కృపా కరూని.. సాయిమావులే – దాస పదరీ ధ్యావా

చిన్మయరూపదాఖవీ ఘేవుని బాలక లఘుసేవ || కా||

అర్ధము :1. ఓ సాయినాధా నీకు కాకడ హారతి చేసెదను. ఈ బాలకుని చిన్న సేవను స్వీకరించుము. 2. కామ, క్రోధ, మద, మాత్యర్యములను వత్తులుగా చేసి వైరాగ్యమను నేతిలో తడిపితిని. 3. సాయినాధుని యందు గల గురుభక్తితో వెలిగించితిని. ఆ వెలుగులో గురువు ప్రకాశవంతముగా కనిపించినాడు. 4. ద్వైతభావము నశించి సత్వస్వరూపియైన జీవుడు మిగిలినాడు. 5. భూమి ఆకాశములందు వ్యాపించిన నీవు సర్వజీవుల హృదయ వాసి. దత్తాత్రేయుని అవతారమైన నీవే షిరిడీలో వుంటూ అందరినీ అలరిస్తున్నావు. అందువలన ఇతర ప్రాంతపు భక్తులు కూడ నీ దగ్గరకు వస్తున్నారు. నిరంతరము నీ దాసుల కష్టాలను తొలగించి వారికి తగిన అనుభూతులనిస్తూ కలియుగంలో నీలాంటి మానవుడు గాని, లేక దేవుడు గాని లేడు అని నిరూపిస్తున్నావు. 6. నీ కీర్తి దుందుభులు ఆకాశం అంతా మారు మ్రోగుతున్నాయి. 7. సగుణమూర్తివైన సాయి! నీకొరకు భక్తులు ఆదుర్దాగా షిరిడికి వస్తున్నారు. 8. అమృతం వంటి నీ మాటలు వినుట వలన వారు మైమరచుచున్నారు. 9. నీ భక్తులు వారి దురభిమానములను విడిచి నీ పాదముల యందు వారి మనస్సు లగ్నము చేయుచున్నారు. 10. సాయినాథా మా అందరినీ కృపాదృష్టితో అనుగ్రహించి ఆశ్రయమిమ్ము.

7. భక్తిచియా పోటీ బోధ – కాకడ జ్యోతీ

పంచప్రాణ జీవే భావే – ఓవాళూ ఆరతీ

ఓవాళు ఆరతీ మాఝ్యా – పండరీనాధా !

                                మాఝ్యా సాయినాధా

దోనహీ కర జోడోనీ చరణీ – ఠెవిలా మాథా || 

కాయ మహిమా వర్ణూ ఆతా – సాంగణే కితీ ||

కోటి బ్రహ్మహత్యా ముఖ – పాహతా జాతీ ||

రాహీ రఖుమాబాయీ ఉభ్యా – దోఘీదో బాహీ||

మయూరపిచ్చ చామరే డాళితి – ఠయీచే ఠయీ ||

తుకా మణే దీప ఘేవుని – ఉన్మనీత శోభా ||

విటేవరీ ఉభా దిసే – లావణ్యగాభా ||

||ఓవాళు||

అర్ధము :1. హృదయమంతా నిండిన భక్తితో నీకు సుప్రభాత హారతి చేయుచున్నాము. 2. మా పంచ ప్రాణములను అయిదు వతులుగా చేసి నీకు హారతి తిప్పుతున్నాము. 3. మా పండరీనాధా ! మా సాయినాధా ! నీకు హారతి 4. నా రెండు చేతులతో నమస్కరిస్తూ నా తలను నీ పాదములపై వుంచుచున్నాను. 5. నీ మహిమలను ఎన్నని నేను వర్ణించగలను. 6. నీ ముఖదర్శనము చేయుటవలన కోటి బ్రహ్మహత్యల దోషం కూడ తొలగిపోవును. 7. రాయి రఖుమాబాయి యిద్దరూ నీకు రెండు వైపులా వుండి నెమలి పింఛములను చామరములుగా వీచుచున్నారు. 8. తుకారావ్ దీమును చేత ధరించి పొగడుచుండగా, భగవదవతారమై, మా కనులకు ఆనందము కలిగించుచున్నారు.

8.   ఉరా సాధుసంత సాధా – ఆపులాలే హిత

జాఈల జాఈల హా నరదేహ – మగకైచా భగవంత||

ఉఠోనియా పహాటే బాబా – ఉభా అసే విటే

చరణ తయాచే గామటే అమృతదృష్టి అవలోకా ||

ఉఠా ఉఠా హో వేగేసీ చలా – జాఊయా రాఉళాసీ

జళతిల పాతకాంచ్యా రాశీ – కాకడ ఆరతి దేఖిలియా ||

జాగేకరా రుక్మిణీవర – దేవ ఆహే నిజసురాత

వేగే లింబలోణ కరా – దృష్ట హో ఈలా తయాసీ ||

ద్వారీ వాజంత్రీ వాజతీ – డోల దమామే గర్జతీ

హోతసే కాకడ ఆరతీ మాఝ్యా – సదురురాయాచీ ||

సింహనాద శంఖభేరి ఆనంద హోతో సే మహాద్వారీ

కేశవరాజ విటేవరీ – నామా చరణ వందితో ||

అర్థము : సాధు సజ్జనులారా లే, లేవండి మీకు మంచిని చేసుకోండి. ఈ శరీరము నశించిపోతే భగవంతుని తెలుసుకొనుట ఎట్లా . 2. ఉదయమే లేచి యిటుకపై నిలిచిన విఠలుని దర్శించి ఆయన అమృత దృష్టిని చూడండి. 3. లే లేవండి త్వరగా ఆలయానికి వెళదాము. కాకడ ఆతి చూసినచో మన పాపములన్నీ నశించును. 4,5,6,7 రుక్మిణీ వల్లభ నిద్రలే ! నీవు దేవతలందరికీ దేవుడవు. త్వరగా వెన్న నివేదన స్వీకరించుము. లేనిచో ఆ వెన్నకు దృష్టి దోషము తగులవచ్చును. 8. ద్వారమువద్దడోలు మొదలైన వాద్యములు మ్రోగుచున్నవి. 9. మా సద్గురునికి సుప్రభాత హారతి జరుగుచున్నది. 10. సింహద్వారమువద్ద శంఖనాదము చేయబడుచున్నది. 11. కేశవరూపుడైన విఠలుని పాదములకు నామదేవుడు నమస్కరించుచున్నాడు.

9. సాయినాధ గురుమాఝే  ఆయీ

మజలాఠావ ద్యావాపాయీ !

దత్తరాజ గురుమాఝే ఆయీ !

మజలాఠావ ద్యావా పాయీ ||

                                     (రెండు సార్లు)

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజై

అర్ధము : నా గురుదేవుడవైన సాయినాథా! నీవే నాకు తల్లివి! దత్తాత్రేయ స్వరూపుడవైన ఓ గురుదేవా ! నీవే నా  తల్లివి. నాకు నీ పాదములవద్ద ఆశ్రయమిమ్ము.

Leave a Reply

WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Discover more from Sai Sannidhi

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

search previous next tag category expand menu location phone mail time cart zoom edit close