సాయి వాణి :విశ్వాసం తో నన్ను నమ్ము. నిన్ను అన్ని వైపుల నుండి రక్షించేదను . నాపై నమ్మకం కలవారికి జయము కలుగును.

కాకడ ఆరతి (తెలుగు అర్థము తో)

10. ప్రభాత సమయీ నభా శుభ రవిప్రభా ఫాకలీ

స్మరే గురు సదా అశా సమయి త్యా ఛళే నా కలీ

మ్హనోని కర జోడూనీ కరు ఆతా గురుప్రార్ధనా

సమర్ధ గురు సాయినాథ పురవీ మనోవాసనా              ||సమ||

తమా నిరసి భానుహా గురుహి నాసి అజ్ఞానతా

పరంతు గురుచి కరీ న రవిహీ కధి సామ్యతా

పున్హా తిమిర జన్మఘే గురుకృపేని అజ్ఞానతా                ||సమ||

వి ప్రగట హోఉని త్వరిత ఘాలవీ ఆలసా

తసా గురుహి సోడవీ సకల దుష్కృతీ లాలసా

హరోని అభిమానహీ జడవి తత్పదీ భావనా                  ||సమ||

గురూసి ఉపమా దిసే విధిహరీహరాంచీ ఉణీ

కుఠోని మగ యేయీతీ కవని యా ఉగీ పాహుణీ

తుజీచ ఉపమా తులా బరవి శోభతే సజ్జనా                    ||సమ||

సమాధి ఉతరోనియాగురు చలా మశీదీకడే

త్వదీయ వచనోక్తి తీ మధుర వారితీ సాకడే

అజాతరిపు సద్గురో అఖిలపాతకా భంజనా                      ||సమ||

అహా సుసమయాసి యా గురు ఉఠోనియా బైసలే

విలోకుని పదాశ్రితా తదియ ఆపదే నాసిలే

అసా సుహితకారి యా జగతి కోణీహీ అన్య నా                   ||సమ||

అసే  బహుత శహణా పరి న జ్యా గురూచి కృపా

న తతత్స్వహిత త్యా కళే కరితసే రికామ్యా గపా

జరీ గురుపదా ధరీ సుదృఢ భక్తినే తో మనా                      ||సమ||

గురో వినంతీమీ కరీ హృదయమందిరీ యా బసా

సమస్త జగ హే గురుస్వరూపచీ ఠసో మానసా

ఘడో సతత సత్క్రుతి మతిహి దే జగత్పా వనా                  ||సమ||

అర్ధము :1. ప్రభాత సమయములో శుభకరుడై సూర్యుడు ప్రకాశించుచున్నాడు. ఈ సమయమున గురుని స్మరించు వారిని కలిమాయ బంధించలేదు. అందువలన చేతులు జోడించి గురువుని ప్రార్ధించెదము. మర్థ గురువైన సాయినాధుడు మనస్సులోని కోరికలను నెరవేర్చును. 2. సూర్యుని వలన చీకటి పోయినట్లుగా, గురువు మనలోని అజ్ఞానాన్ని తొలగించును. అయినా గురువుతో సూర్యుని పోల్చటం సరియైన పద్దతి కాదు. ఎందువలననగా సూర్యుడు తొలగించిన చీకటి మళ్లిరాత్రి కాగానే వస్తుంది. కాని, గురువు తొలగించిన అజ్ఞానం మళ్లీరాదు. 3. సూర్యుడుదయించి మనలోని అలసటను తొలగిస్తాడు. అలాగే గురువు చెడుపనులు చేయుట యందుగల కోరికను తొలగిస్తారు. దురభిమానమును వదలి ఆయన పాదపద్మములయందు మనస్సులను నిలిపెదము కాక. 4. సాయి సద్గురునికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సాటిరారు. ఈయన భూమి మీద ప్రజలను తరింప చేయు మహనీయుడు. ఈయన తో పోల్చదగినవారెవరు లేరు. 5. సమాధి నుంచి లేచి,మసీదునకు వచ్చి మధురమైన నీ వాక్కులతో మా కష్టములను తొలగించుము. నకల పాపములను తొలగించు అజాత శత్రువు మన సాయి . 6. యిది ఎంతో మంచి సమయము. గురువు నిద్రలేచి తనను ఆశ్రయించిన భక్తుల కోరికలను నెరవేర్చుచున్నారు. ఈ విధముగా ఉపకారము చేయువారు ప్రపంచములో యింక ఎవ్వరూలేరు. 7. గురు కృప లేక ఎంత తెలివిగలవాడైన జీవిత గమ్యము పొందలేక వ్యర్ధముగా కాలయాపన చేయును. గురు పాదముల యందు మంచి ధృడమైన భక్తిని పొందినచో సద్గురు సాయినాధుడు అతని కోరికలన్నింటిని నెరవేర్చును. 8. నా హృదయములో ఎల్లప్పుడు నివసించమని గురువును ప్రార్ధించెదను. సమస్త ప్రపంచము గురు స్వరూపముగా మనస్సునకు అనిపించునట్లు చేయుము. ప్రపంచమునంతను పవిత్రపరచు సత్కార్యము చేయు బుద్ధిని ప్రసాదించుము. సమర్ధ సద్గురు సాయినాధా నా మనస్సులోని కోరికలను నెరవేర్చుము.

11.ప్రేమే యా అష్టకాశీ పఢుని గురువరా –

                                                  ప్రార్దితీ జే ప్రభాతీ |

త్యాంచే చిత్తాసి దేతో అఖిల హరునియా –

                                              భ్రాంతి మి నిత్య శాన్తీ  ||

ఐసే హే సాయినాధే కధుని సుచవిలే – జేవియా బాలకాసీ!

తేవీ త్యా కృష్ణపాయీ నమునిసవినయే- అర్పితో అష్టకాసీ || 

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కీ జై !!

అర్ధము : ప్రేమతో ఈ అష్టకమును ( ఈ గీతము) చదివి ప్రభాత సమయములో గురువును ఎవరు ప్రార్ధిస్తారో అట్టివారి మనస్సు నుంచి భ్రమలను తొలగించి నిత్యశాంతి ప్రసాదిస్తాను అని సాయినాధుడే బాలకుడైన కృష్ణారావు జగేశ్వర భీష్మ (రచయిత) ఈ అష్టకమును రాసి సమర్పించినపుడు చెప్పెను.

12. సాయీ రహమ్ నజర్ కర్నా,

 బచ్చోంకా పాలన్ కర్ నా                                  ||సా||

జానా తుమనే జగత్పసారా,

సబ్హీ ఝూట్ జామానా

మై అంధాహూఁ బందా ఆప్ కా,

ముఝసే ప్రభు దిఖలానా                   ||మై|| ||సా||2

దాసగణు కహే అబ్ క్యా బోలూ,

థక్ గయి మేరీ రసనా                        ||దా|| ||సా||2

అర్థము : ఓ సాయిదేవా ! నీ కరుణా దృష్టిని మాపై వుంచి నీ బిడ్డలమైన మమ్మల్ని రక్షించుము. జాగ్రత్తగా తెలుసుకుంటే, నీవే ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నావు. నీవు తప్ప మిగిలిన ఈ ప్రపంచమంతా అసత్యము (అశాశ్వతము) నేను జ్ఞాన దృష్టి లేని అంధుడను. ప్రాపంచిక బంధాలన్నిటిని తెంచుకొని సర్వబంధాలను నీపై పెంచుకున్న వాడిని. నాకు జగత్ర్పభువైన భగవంతుని మిరే చూపించాలి. ప్రభాత సమయంలో మి దర్శనంతో నా గొంతు మూగబోయినది. అందువలన ఈ దాసుడు యింకేమి మాట్లాడగలడు ?

  1. రహమ్ నజర్ కరో అబ్ మోరే సాయి

తుమ్ బిన్ నహీ ముఝే  మా, బాప్, భాయీ  ||రహమ్ ||

మై అంధాహు, బందా తుమారా (2)

మై నా జానూ (3), అల్లాఈలాహి  ||రహమ్||

ఖాలీజమానా, మైనే గమాయా (2)

సాధీ ఆఖిర్ (3) కియానకోయీ  ||రహమ్ ||

అప్నే మసీద్ కా ఝూడూ గణూ హై (2)

మాలిక్ హమారే(3)  తుమ్ బాబా సాయీ   ||రహమ్ ||

అర్ధము : ఓ సాయిదేవా! ఇప్పుడు నీ కరుణా దృష్టిని నా పై ప్రసరించుము. నీవు తప్ప నాకు తల్లి దండ్రి, అన్నదమ్ములు ఎవ్వరూ లేరు. నిన్ను తప్ప యింకేమి చూడలేని అంధుడను. సర్వబంధాలను నీపై పెంచుకున్నాను. నీ బందీని నేను, భగవంతుడుగాని సత్యముగాని నాకు తెలియదు. నా జీవిత సమయమంతా వ్యర్ధము చేసుకున్నాను. నీవు తప్ప ఆఖరికి తోడు ఎవ్వరూ రారు. ఈ దాసుడు మీ మసీదు తుడిచే చీపురు వంటివాడు. మా యజమానివి నీవే.

14. తుజ కాయ దేవూ సావళ్యా మి ఖాయా తరీ హో  ||తుజ||

తుజ కాయ దేవూ సద్గురు మీ ఖాయా తరీ హో

మీదుబళీ బటీక నామ్యాచీ జాణ శ్రీహరీ     ||మి||

ఉచ్చిష్ట తులా దేణీ హి గోష్ట నా బరీహో      || ఉచ్చి ||

తూజగన్నాధ తుజచేవూ కశీ రే భాకరి     ||తూ ||

నకో అంత మదీయ పాహూ సఖ్యా భగవంతా, శ్రీ కాంతా

మధ్యాహ్న రాత్ర ఉలటోని గేలీహీ అతా – ఆణచిత్తా !

జా హోయీల తుఝా రే కాకడా కీ రాఉళాంతరీ      ||జ||

అణతీల భక్త నైవేద్యహి నానాపరీ                             ||అణ||    || తుజ||

అర్ధము : ఓ నల్లనివాడా ! నీకు తినుటకు నేనేమి నైవేద్యమివ్వగలను. ఓ శ్రీహరి! నేను శక్తిలేని నీ బానిసను. నేను ఎంగిలిని ఎలా నైవేద్యంగా సమర్పించేది. ఓ జగన్నాథ ! ఓ భగవంత ! ఓ శ్రీకాంత ! నా యందు సఖ్యతను ఎప్పుడూ కొనసాగించుము. మధ్యాహ్న, రాత్రి సమయములో కూడ నేను నీ దర్శనము కొరకు వచ్చెదను. నీ మనస్సును నా వైపు మరలించుము. కాకడ హారతి అయిన వెంటనే అనేక మంది భక్తులు నీకు నైవేద్యాలు సమర్పించెదరు.

15. శ్రీ సద్గురు బాబా సాయీ హో             ||శ్రీ||

తుజవాచుని ఆశ్రయ నాహి, భూతలీ        ||తుజ ||

మీ పాపీ పతిత ధీమంద                        ||మి||

తారణే మలా గురునాధా డకరీ           ||తార||

తూ శాంతి క్షమేచా మేరూ హో                 ||తూ||

తూ భవార్ణవీచే తారూ గురువరా              ||తూభ ||

గురువరా మజసి పామరా, ఆతా ఉద్దరా

త్వరిత లవలాహి (2)

మీ బుడతో భవభయ డోహి ఉద్దరా           ||శ్రీ సద్గురు||

అర్ధము :శ్రీ సద్గురు సాయిబాబా ! నిన్ను కాక ఈ ప్రపంచములో యింకెవరినీ ఆశ్రయించను. నేను పాపిని, పతితుడను. మందబుద్ధిని వెంటనే నన్ను ఉద్దరించుము గురుదేవా ! శాంతి, క్షమా గుణములలో మీరు మేరు పర్వతము వంటివారు. ఈ భవసాగరము నుంచి తరింప చేయు గురుదేవులు మీరే. నాలాంటి పామరులను త్వరత్వరగా ఉద్దరించుము. ఈ సంసార సాగరంలో మునిగి తేలుతున్న నన్ను ఉద్దరించుము.

(సుప్రభాత) కాకడ హారతి సమాప్తము.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!

(పుష్పములు చల్లవలెను)

ఓం రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై !

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు-

సాయినాథ్ మహారాజ్ కీ జై !

Leave a Reply

WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Discover more from Sai Sannidhi

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

search previous next tag category expand menu location phone mail time cart zoom edit close