5.నమనము (కర్పూరము వెలిగించి హారతి యిస్తూ)
ఘాలీన లోటాంగణ, వందీన చరణ,
డోల్యాని పాహీన రూప తుఝే,
ప్రేమే ఆలింగిన, ఆనందే పూజిన.
భావే ఓవాళీన మణే నామా ||
త్వమేవ మాతా చ పితా త్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మమ దేవ దేవ !!
కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధాత్మనావా ప్రకృతి స్వభావాత్
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణా యేతి సమర్పయామి ||
అచ్యుతం కేశవం రామనారాయణం
కృష్ణ దామోదరం వాసుదేవం హరిం
శ్రీధరం మాధవం గోపికా వల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే ||
అర్ధము: మీ పాదములపై శిరస్సు వుంచి సాష్టాంగ నమస్కారము చేయుచూ మీ రూపాన్ని చూచి ఆనందిస్తూ ప్రేమతో మిమ్ము ఆలింగనం చేసికొని, ఆనందంగా మిమ్మల్ని పూజిస్తూ మీ నామస్మరణచేస్తూ, మీకు హారతి యిస్తాము. 2. నీవే నాకు తల్లివి, తండ్రివి, సర్వబంధువులు నాకు నీవే. నాకు స్నేహితుడవు నీవే, నీవే విద్యవు, నీవే ధనము. దేవదేవుడవైన ఓసాయి! నీవే నాకు సర్వస్వము. 3. శరీరము, వాక్కు మనస్సు యింద్రియాలతోను, బుద్ధి, ఆత్మ, సహజమైన ప్రాకృతిక స్వభావాలన్నిటితోను ఏమేమి పనులు చేస్తానో అవి మొత్తం నారాయణ రూపుడవైన నీకు సమర్పిస్తున్నాను. 4. అచ్యుత, కేశవ, రామ, నారాయణ, కృష్ణ, దామోదర, వాసుదేవ, హరి, శ్రీధర, మాధవ, గోపికా వల్లభ, జానకీ నాయక, రామచంద్ర మొదలైన అనేక పేరులతో పిలువబడు నిన్ను నేను భజిస్తున్నాను.
6.నామస్మరణము
హరే రామ హరే రామ రామరామ హరే
హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే ||
శ్రీ గురుదేవ దత్త !
7.మంత్ర పుష్పం
హరిః ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి
ప్రథమాన్యాసన్-తే హ నాకం మహిమానః సచంత
యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః |
ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే |
నమో వయం వైశ్రవణాయ కుర్మహే |
సమే కామాన్ కామకామాయ మహ్యం
కామేశ్వరో వైశ్రవణో దధాతు !
కుబేరాయ వైశ్రవణాయ, మహారాజాయ నమః
ఓం స్వస్తి ! సామ్రాజ్యం భోజ్యం,
స్వారాజ్యం వైరాజ్యం పారమేష్ట్యం రాజ్యం
మహారాజ్యమాధిపత్య మయం సమంతపర్యా |
ఈశ్యాత్సార్వభౌమ స్సార్వాయుష్య ఆన్
తాదాపరార్జిత్ పృథివ్యై సముద్రపర్యంతాయా |
ఏకరాళ్ళితి! తదప్యేష శ్లోకోభి గీతో మరుతః |
పరివేష్టారో మరుత్తస్యావసన్గృహే ||
ఆవిక్షితస్య కామప్రేర్ విశ్వేదేవా : సభాసద ఇతి ||
శ్రీ నారాయణ వాసుదేవ సచ్చిదానంద సద్గురు సాయినాధ్
మహరాజీకి జై !
8.నమస్కారాష్టకము
అనంతా తులా తే కసే రే స్థవావే
అనంతా తులా తే కసే రే నమావే
అనంతా ముఖాంచా శిణీ శేష గాతా
నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథా ||
||న||
స్మరావే మనీ త్వత్పదా నిత్య భావే
ఉరావే తరీ భక్తిసాఠీ స్వభావే
తరావే జగా తారునీ మాయతాతా
||న||
వసే జో సదా దావయా సంత లీలా
దిసే అజ్ఞ లోకాం పరీ జో జనాలా
పరీ అంతరీ జ్ఞాన కైవల్యదాతా
||న||
బరా లాధలా జన్మ హా మానవాచా
నరాసార్ధక సాధనీభూత సాచా
ధరూ సాయిప్రేమేగళాయా అహంతా
||న||
ధరావే కరీ సాన ఆల్పజ్ఞ బాలా
కరావే అమాం ధన్య చుంబోని గాలా
ముఖేఘాలా ప్రేమే ఖరా గ్రాస ఆతా
||న||
సురాదీక జ్యాంచ్యా పదా వందితాతీ
శుకాదీక జ్యాతే సమానత్వ దేతీ
ప్రయాగాది తీర్థ పదీ నమ్ర హోతా
||న||
తుజ్యా జ్యా పదా పాహతా గోపబాలీ
సదా రంగలీ చిత్స్వరూపీ మిళాలీ
కరీ రాసక్రీడా సవే కృష్ణనాథా .
||న||
తులా మాగతో మాగణే ఏక ద్యావే
కరా జోడితో దీన అత్యంత భావే
భవీ మోహనీరాజ హా తారీ ఆతా
నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథా!
అర్ధము :1. ఓ అనంత ! నిన్నేమని పొగడెదను. నీకెట్లు నమస్కరించవలెను. అనంత ముఖములు కలిగిన ఆదిశేషుడే నిన్ను పొగడలేడు. ఓ సాయినాథా ! నీకు సాష్టాంగ నమస్కారము చేయుచున్నాను. 2. మనస్సులో నిత్యము నీ పాదములను స్మరించుకుంటాను. అపుడు భక్తి నీమీద స్థిరమౌతుంది. ఈ ప్రాపంచిక మాయ నుంచి నన్ను తరింప చేయము. 3. సత్పురుషులకు నీ లీలలు చూపటానికే నీవు యింకా నివసిస్తున్నావు. అజ్ఞానము గలవారికి మాత్రం నీవు కూడ అజ్ఞానివలె కనిపిస్తావు. కాని యదార్ధముగా నిజమైన జ్ఞానాన్ని, ముక్తిని యిచ్చే దాతవు నీవే. 4. మానవ శరీరం లభించుటయే ధన్యం. నరులంతా సాధన ద్వారా భగవంతుని పొంది జన్మసార్ధక వరచుకోవలెను. అహంకారము తొలగించుకొని, సాయి ప్రేమను పొందవలెను. 5. అల్పబాలుడనైన నన్ను నీవు చేతితో పట్టుకొనుము. నన్ను ముద్దాడి ధన్యుడిని చేయుము. ప్రేమతో నా నోటిలో ప్రసాదము వేయుము. 6. దేవతలందరూ ఎవరి పాదములకు నమస్కరిస్తారో శుకాది సత్పురుషులు ఎవరికి సమాన స్థానమిస్తారో ప్రయాగాది తీర్ధములు ఎవరి పాదములవద్ద నమ్రతతో వుండునో, అట్టి నీకు సాష్టాంగ నమస్కారము. 7. నీ పాదములు పొందుటకు గోపికలు ఆనందంతో నీ చిత్స్యరూపంలో కలిసిపోయి రాసక్రీడ సలిపారు. అట్టి కృష్ణ రూపుడవైన సాయినాధా నీకు సాష్టాంగ నమస్కారము. నిశ్చల భక్తితో నిన్ను వేడుకుంటున్నాను. చేతులు జోడించి అత్యంత దీనభావంతో అడుగుతున్నాను. మోహములతో కూడిన ఈ సంసార సముద్రము నుండి నన్ను తరింపచేయుము.
