సాయి వాణి :విశ్వాసం తో నన్ను నమ్ము. నిన్ను అన్ని వైపుల నుండి రక్షించేదను . నాపై నమ్మకం కలవారికి జయము కలుగును.

ఉద్ధవరావ్ దేశ్ పాండే అనుభవాలు

26169278_10154944273360740_3308615185784571718_nఉద్దవరావ్ దేశ్ పాండే

మాధవరావ్ దేశ్ పాండే (శ్యామా) కుమారుడు ఉద్దవరావ్. ఆయన సాయి గూర్చిన తమ స్మృతులిలా చెప్పాడు:

”బాబా మహాసమాధి చెందేనాటికి నాకు 12 లేక 14 సం.లుంటాయి. అంతవరకు నేను తరచుగా వెళ్ళి సాయి సన్నిధిలో కూర్చునేవాణ్ణి. కారణం ఆయన తరచుగా పాలకోవా, జీడిపప్పు పాకం వంటివి పెడుతుండేవారు. నాకు జీడిపప్పు పాకం ఎక్కువయిష్టమని గుర్తించి ప్రసాదాలన్నింటిలో తరచుగా నాకు అదే పెడుతుండేవారు. నా తండ్రి పై ఆయనకున్న (పేమవల్ల నన్నుగూడ ఆయనెంతో ప్రత్యేకంగా లాలించేవారు. అది తగదని మా తండ్రి ఎంత చెప్పినా, ఆయన దివ్య పురుషుడన్న భావం ఒక ప్రక్క వున్నా స్వంత తాతతో ప్రవర్తించినట్లే ఆయనతో గూడా ప్రవర్తించేవాణ్ణి. సుమారు నా ఆరవయేట ఒకరోజు నేను బడికి వెళ్ళకుండా యింట్లోనే తిరుగుతున్నాను. చివరకు నా తండ్రికి కోపము వచ్చి, కర్ర తీసుకొని తరిమితే నేను బడికి వెళ్ళనని మొండిగా జవాబు చెప్పి, మశీదు వద్ద నున్న బాబా చెంతకు పరిగెత్తాను. నా తండ్రి మశీదులోకి వచ్చేసరికి నేను వెళ్ళి బాబా ప్రక్కనే కూర్చున్నాను. పరిస్థితి గమనించి బాబా కనులెర్రజేసి, ” నీవిలా పిల్లవాణ్ణి కొట్టడానికి వీలులేదు” అని గదమాయించారు. మా నాన్న, “వాడు బడికి వెళ్ళమంటే వెళ్ళడంలేదు. చదువుకోకుంటే వాడికి అన్న మెవరు పెడతారు? అలా వాడు మారాం చేస్తుంటే కొట్టవద్దంటే ఎట్లా?” • అన్నాడు. బాబా, ‘వాడికి అన్నం నేను పెడతాను. నీవు వాణ్ని కొట్టడానికి వీల్లేదు!’ అని గద్దించారు. ఇక చేసేదిలేక మా నాన్న యింటికి వెళ్ళిపోయాడు. ఆనాడు బాబా చెప్పిన మాట అక్షరాల నిజమైంది. నాకు యుక్తవయసొచ్చాక  అంటే బాబా సమాధి చెందిన కొన్ని సం.లకు  నన్ను ఏదైనా పనిలో చేర్పించాలని సాఠె మొ.న భక్తులు నన్ను పూణేకు, యితర నగరాలకు తీసుకు వెళ్ళాలని అనేక సార్లు ప్రయత్నించారు. కాని సరిగా బయల్దేరే రోజుకు నాకెక్కడిలేని రోగం ముంచుకొచ్చి ఆ ప్రయత్నం మానుకోవలసి వచ్చేది. ఇలా ప్రతిసారీ జరగుతూండడంతో నేను శిరిడీ విడిచి వెళ్ళడానికి బాబా అనుమతి లేదని తలచి ఆ ప్రయత్నం విరమించుకొన్నారు. తరువాత సంస్థానంలోనే ఉద్యోగం యిప్పించి బాబాయే నాకు అన్నం పెట్టారు.

ఒకసారి ఎవరో భక్తుడు బాబాచేత తాకించి పూజలో పెట్టుకోదలచి ఒక నల్లరాతి విఘ్నేశ్వరుని విగ్రహం బాబా చేతికిచ్చాడు. ఆయన దానిని కొద్ది సేపు తమ ఒడిలో వుంచుకొని తిరిగి ఆభక్తునికిచ్చేబదులు మా తండ్రికిచ్చి, ‘ఇది నీదగ్గరుంచుకో!’ అని చెప్పారు. అది అప్పటినుండి మా యింట్లోనే వున్నది.IMG_20190307_185555.jpgసాయిబాబా ఉద్ధవ్ గారికి ఇఛ్చిన విఘ్నేశ్వరుని యొక్క నల్లని రాతి విగ్రహము

 

Leave a Reply

WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Discover more from Sai Sannidhi

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

search previous next tag category expand menu location phone mail time cart zoom edit close