సాయి వాణి :విశ్వాసం తో నన్ను నమ్ము. నిన్ను అన్ని వైపుల నుండి రక్షించేదను . నాపై నమ్మకం కలవారికి జయము కలుగును.

జీవన రధ సారధి సాయి (కష్ట కాలం లొ అడుగడుగునా సాయి సహాయం )

ఓం శ్రీ సాయి నాధాయనమః

నాకు ట్రాన్ఫర్ అయిన స్కూల్ కి రోజు మా ఇంటి నుండే ప్రయాణం చేసి వచ్చేదాన్ని. రాను పోను సుమారు 220 kms ప్రయాణం తో చాలా అలిసి పోయేదాన్ని.పైగా ఇటీవల ఆక్సిడెంట్ లొ fracture అయిన కాలు తో చాలా ఇబ్బంది పడుతూ ప్రయాణం చేసేదాన్ని.ఆక్సిడెంట్ అయ్యాక అంతా అస్తవ్యస్త పరిస్థితి.కొన్ని రోజులు అలా ప్రయాణం చేసి,కొన్ని రోజులు లీవ్ పెట్టుకుని, లీవ్స్ అయిపోయాక సుమారు 2నెలలు జీత నష్ట సెలవులు కూడా పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ కాలములో విపరీతంగా డిప్రెషన్ కి లోనయ్యాను.బాబా పైన నమ్మకం కూడా కోల్పోయాను. బాబా పైన ధ్యాస తగ్గింది.. ఆ క్రమం లొ ఒకరోజు నిద్ర లొ ఒక దృశ్యం కనిపించింది. “Mobile లొ ఒక వాట్సాప్ chat open అయ్యి దానిలో, “4pm కి కలుస్తాను ” అనే message కనిపించింది.తరువాత, మాట్లాడక చాలా రోజులవడం వల్ల ఒక సాయి సేవక్ కి (పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారి వద్ద సాయి సేవక్ దీక్ష తీసుకున్న ఒక భక్తురాలు ) నేను phone చేయడం,మాటల్లో ఆమె “గురుగారు హైదరాబాద్ కి ఫలానా date లొ వస్తున్నారు అని చెప్పడం జరిగింది (తనకి phone చేసే ప్రేరణ కల్పించింది కూడా సాయే ). గురుగారు వస్తున్నారు అని తెలిసి వారిని కలవడానికి appointment కోసం ఒక సాయిసేవక్ ద్వారా గురుగారిని అడిగించాను.సాధారణం గా గురుదేవులు అంత easy గా ఎవరితో కలవరు. కానీ నేను appointment కోసం అడగ్గా సాయి అనుగ్రహం తో ఒప్పుకున్నారు.(బాధల్లో ఉండి గురువు గా తన ని అనుసరించేవారికి సహాయం సలహాలు ఇవ్వాల్సిన పరిస్థితి లొ గురుగారు ఎప్పుడు కూడా ఊరకే వుండరు. తగిన సలహా సహాయం అందించి తమ శిష్యులని కాపాడుతుంటారు )కల లొ చూసిన message లొ 4pm కి కలుస్తాను అన్న ప్రకారం గానే,” 4pm కి షిరిడీ వెళ్లే train కోసం గురుగారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వస్తారు, అక్కడ గురుగారిని meet అయ్యేందుకు సిద్ధం గా అక్కడ ఉండండి ” అని ఆ సాయిసేవక్ చెప్పడం జరిగింది.నా బాధ చూసి నాకు ఓదార్పు గా నాకు దర్శనం ఇచ్చే సమయం ముందుగానే కల లొ చెప్పి మరీ నాకు నా గురుదేవులు రైల్వే స్టేషన్ద లొ దర్శనం ఇచ్చారు. (మా గురుగారిలో వారి పవిత్ర జీవనం అచంచలమయిన వారి భక్తి, సేవలకి సాక్షాత్తూ ఆ సాయినాధుడే వారిలో కొలువై వుంటారు. వారి మాటలు సాయి వాక్కులే. వారిలో సర్వం సాయి మయమే!సాయినాధుడు తన ఉనికిని పూజ్య గురుదేవులద్వారా ప్రకటిస్తుంటారు )వారు అక్కడ దయ తో నా యోగక్షేమాలు కనుక్కొని,నా కాలు ఫ్రాక్చర్ కి సలహాలు ఇవ్వడం జరిగింది.కర్మ పోగొట్టుకునే మార్గం కూడా సూచించడం జరిగింది..అలాగే నేను ఎక్కడ ఇల్లు తీసుకోవాలనే విషయం లోనూ సలహా అడిగి,వారి సూచన మేరకు నేను పని చేసే చోటనే ఇల్లు అద్దె తీసుకోవడం జరిగి అక్కడే ఉంటున్నాను.

అయితే కొన్నిరోజులకి, ఇల్లు అద్దె కి ఇచ్చేముందు owners తాము ఇచ్చిన మాట పక్కన పెట్టి, ఆ అగ్రిమెంట్ కి విరుద్ధంగా వాళ్ళు ఒక విషయం లొ ఇబ్బంది పెట్టేసరికి, నేను అక్కడే కొత్త గా తయారు అవుతున్న ఇంటికి shift అవుదామని ఆ విషయం ఇంటి owner కి చెప్పడం కూడా జరిగింది.. కానీ నేను అనుకున్న time కి ఆ ఇల్లు ready కాకపోవటం తో మరలా సమస్య మొదలయ్యింది. ఎందుకంటె నేను ఇల్లు మారతాను అని చెప్పడం వల్ల,owner ఆ ఇల్లు rent కోసం అడిగిన వేరే వారికి, ఇచ్చేస్తామని చెప్పడం కూడా జరిగిపోయింది.ఇపుడు ఏం చేయాలో అని ఆ రాత్రి టెన్షన్ తో నిద్ర పట్టలేదు. ఇపుడు ఈ సమస్య కూడా నువ్వే పరిష్కరించాలి అని బాబా ని వేడుకున్నాను. ఎందుకంటె ఈ అనారోగ్యం తో నేను ఇంకా ఇల్లు వేరేదగ్గర వెతికే ప్రయత్నాలు చేయలేను.. మరుసటి రోజు ఇంటి ఓనర్ కి నేను ఇప్పుడే shift చేయను అని చెపుదాం అని call చేసేసరికి వారు అనూహ్యం గా “పర్లేదు, ఆ కొత్త renters కి ఇల్లు ఇవ్వట్లేదు, మీరే ఉండవచ్చు” అని అప్పటి వరకు ఇల్లు వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అని ఖచ్చితంగా చెప్పినవారు కూడా అలా సామరస్యం గా మాట్లాడ్డం సాయి కృప కాక మరేంటి!!..ఇలా అడుగడుగునా సహాయం చేస్తూ ఈ కష్ట కాలం లొ సాయి నన్ను ఆదుకుంటున్నారు. సాయి నువ్వే నా ఆధారం సాయి నన్ను మీ ఛాయ లొ ఉంచుకుని మీ రక్షణ ని తోడు ని జీవితాంతం ఇవ్వండి తండ్రీ!నా శేష జీవితం లొ అనుక్షణం నీ సేవ లొ గడిపే భాగ్యం ప్రసాదించు తండ్రీ!!🙏🙏

మన జీవిత రధ సారధి అయిన సాయినాధుడికి మన జీవిత పగ్గాలు అప్పగించి, సదా ప్రతి విషయం వారితో ముడి పెడుతూ వారికి సర్వస్య శరణాగతి తో మన జీవితం గడుపుదాం. ఓర్పు విశ్వాసాలే ఆయుధాలు గా చేసుకుని సాయి అండ తో ఈ జీవన పోరాటం లొనే కాక అరిశడ్వర్గాల తో మనం చేయు నిరంతర పోరాటం లొ విజయం సాధిద్దాం.

Leave a Reply

WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Discover more from Sai Sannidhi

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

search previous next tag category expand menu location phone mail time cart zoom edit close