
ఓం శ్రీ సాయినాథాయ నమః
పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలి అనుభవం తెలుసుకుందాం వారి మాటల్లోనే..
“సాయిబాంధువులందరికీ నమస్కారం.. నేను ఒక సామాన్య సాయి భక్తురాలిని. సాయి సన్నిధి బ్లాగ్ చూసి నేను కూడా నా అనుభవాలు పంచుకుందాం అని అనుకుంటున్నాను. నాకు చాలా కాలం నుండి బాగా తలనొప్పి వచ్చేది. డాక్టర్ కి చూయించుకుంటే మైగ్రేయిన్ తల నొప్పి అన్నారు. నొప్పి భరించలేక చాలా బాధ పడేదాన్ని. ఒకరోజు సాయి నాధుడిని తలచుకొని బాబా విభూతి ని నొప్పి వున్న చోట రాసుకున్నాను.ఎంతో కాలం నుండి తీవ్రంగా వేదిస్తున్న తల నొప్పి తగ్గింది. ఇపుడు తరచూ రావడం లేదు.సాయి నా మొర విని నా మైగ్రైన్ నొప్పిని తగ్గించారు.ధన్యవాదములు తండ్రీ.
ఇంకొక అనుభవం. నేను సాయి ని తలచుకోగానే నా బిడ్డ కి కూడా సహాయం చేసారు. మా అమ్మాయి బి. టెక్ మూడవ సంవత్సరం పరీక్ష లొ ఒక సబ్జెక్టు పోయింది. మళ్ళీ రాసింది. అపుడు కూడా ఒక సబ్జెక్టు పోయింది అని వచ్చింది. బాబా కి చెప్పుకుని చాలా బాధ పడ్డాను. మా అమ్మాయి రివాల్యుయేషన్ కి పెట్టుకుంది.మా పాప తో బాటు ఇంకో పది మంది మా పాప class వాళ్ళు కూడా రివాల్యుయేషన్ పెట్టుకున్నారు. వారందరిలో మా పాప ఒక్కతే pass అయింది. ఇదంతా సాయి దయ.సాయినాధుడిని స్మరిస్తే ఆయన మనల్ని వెంటనే ఆదుకుంటారు.”
ఓం శ్రీ సత్ చిత్ ఆనంద సాయి నాధాయ నమః
