
సాయిరాం.. నా జీవితం లొ ప్రస్తుతం కష్ట కాలం నడుస్తోంది అనే విషయం మీతో గత అనుభవం లొ పంచుకున్నాను కదా.అలాగె ఈరోజు ఉదయం నుండి చాలా సమస్య, గందరగోళం తో గడిచింది. ఉదయం లేవగానే పక్కలోనే సాయి ని దర్శించుకునే అలవాటు వున్న నేను పనిమనిషి వచ్చి తలుపు కొడుతోండటం తో బాబా ని దర్శించుకోకుండానే వెళ్లి తలుపు తీసాను. అంటే ఈరోజు ని నేను సాయి తో మొదలు పెట్టలేదు. ఏ రోజు అయినా ఇలా సాయిదర్శనం తో మొదలు పెట్టకపోతే ఆరోజు మంచిగా గడవదు నాకు. ఆరోజు ఏదో problems వస్తుంటాయి. అలాగే ఈరోజు car లొ హైదరాబాద్ కి పని కోసం వెళ్లాల్సి ఉందని driver ని రమ్మని చెప్పడం జరిగింది. ఆయన కొద్దిగా రాష్ గా car ని నడిపిస్తుంటాడు అయినా వేరే drivers అందుబాటులో లేకపోవడం వల్ల అతన్నే పిలవాల్సి వచ్చింది. సాయి ని చూసి ఈ రోజు ని ప్రారంభించలేదు ఏంటో అని అనుకున్నాను. ఇక మొదటి సమస్య మొదలయ్యింది.Car start కాలేదు.బ్యాటరీ problem అంట,సర్వీస్ వాళ్ళని పిలిచి బ్యాటరీ ని start చేయించి ఆలస్యం గా బయలుదేరాం. కానీ మనసులో ఏదో కీడు శంకించింది. ఈరోజు బాబా నీ దర్శనం ఇక లేదా అనుకున్నాను.తరువాత car బ్యాటరీ కొనడానికి ఒక shop దగ్గర car ఆపి నేను car లొ కూర్చుని driver ని shop కి పంపాను. (నా కాలి కి దెబ్బ తగలడం వల్ల ఎక్కువ నడవలేకపోతున్నాను ) car లొ నుండి Shop వైపు చూస్తోంటే అక్కడ అప్పటికే సాయి కొలువైయి వున్నారు.. ఆ దృశ్యం car లొ నుండి తీసిన photo ఇక్కడ పొందు పరుస్తున్నాను.. సాయి భక్తులకి మన భావాలకి తగ్గట్టు ఎక్కడ అయినా సాయి దర్శనం ఇస్తే ఆ ఆనందం వర్ణించాలేము కదా!!

దారిలో ఆ driver వ్యవహారం ముందటి కన్నా ఇబ్బంది గా అనిపించింది. ఒక సందులో car ని మలుపుతూ ఉంటే దేనీకో car తగిలించి car front dipper కి కొద్దిగా డామేజ్ చేసాడు. నాకు బాధ, కోపం తో చాలా చికాకు అనిపించింది,.మనసు పాడయ్యి మా అక్క తో ఇలా అయింది అని చెప్పుకుంటుంటే “చిన్న విషయం, వదిలేయ్ పెద్ద ప్రమాదం అయ్యేది చిన్న దానితో పోయింది అని సరిపెట్టుకో “అని చెప్పడం తో నాకు నిజమే అని అనిపించింది. ఇక పని చూసుకుని తిరిగి వస్తుంటే చాలా చీకటి పడింది.మన మహానుభావుడు ఈసారి జంక్షన్ లొ వేగం గా మా ముందు నుండి cross చేస్తోన్న car ని అంతే వేగం తో గుద్దబోయాడు.ఇదంతా చూస్తున్న నేను చాలా భయం తో ఏదో అయిపోతోంది ఇక అనుకునే లోపు driver వెంట్రుక వాసిలో సడన్ గా break వేయడం తో చాలా పెద్ద ప్రమాదం తప్పింది.వెంటనే ఊపిరి పీల్చుకున్నాను. ఇంకా కొంచెం దూరం వెళ్ళాక మా ముందే ఒక టిప్పర్ ని తప్పించబోయి ఒక car skid అయ్యి damage అయింది. అదృష్టం కొద్దీ car లోని వారికేమీ కాలేదు. Car damage అయ్యి ఆగిపోవడం తో వాహనాలు ఆగిపోయాయి.మేము బాబా ని స్మరించుకుంటూ కష్టం గా ఒక పక్కనుండి car ని దాటించి పోనిచ్చాము.నాకు మనసంతా చాలా ఆదుర్ద గా అశాంతి గా అనిపించింది.ఇంటికి చేరే లోపు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని సాయి ని స్మరిస్తూనే వున్నాను , మనసులో, ఇదంతా ఏంటి బాబా ఈరోజు ఇలా చేస్తున్నావు? దయ తో నన్ను రక్షించు అని వేడుకొని సాయి స్పందన కోసం Facebook open చేశాను.దానిలో నా భావాలకి తగ్గట్టు గా క్రింది message కనిపించి సాయి దైర్యం చెప్పాడు.ఆ message కూడా ఇక్కడ పొందుపరుస్తున్నాను.

సాయి నా మనసులో ని అశాంతి పోయేలా తన మెసేజ్ ద్వారా నాకు సాంత్వన కలిగించారు. ఈ సందేశం తెలుగు లొ అర్థం “మీరు ఈ సందేశం ని చూస్తున్నారు అంటే అది యాద్రుచ్చికం కాదు. బాబా ఆశీర్వాదాలు ఇప్పటికే మీరు గ్రహించలేని విధంగా మిమ్మల్ని ఆవరించి వున్నాయి,. ఒక్క క్షణం కేటాయించి ఆగి ఆ శాంతి ని మీరు మీ మనసులో అనుభవం లోకి తెచ్చుకోండి…………… సాయి రక్షణ హస్తం ఎల్లప్పుడూ మీ శిరస్సు పై వుండు గాక “.. అంటే నాకు ఎదురవుతున్న సంకటాలని చూసి అశాంతి తో వున్న నాకు,కొంచం ఆగి ఈ ఆదుర్దా,ఆలోచన లని కట్టిపెట్టి, సంకటాలు సమీపానికి వచ్చినా ఏవీ నను తాకనివ్వని తన రక్షణ ని గుర్తించమని సాయి సందేశం ఇచ్చారు. ధన్యవాదములు సాయి దేవా… నాకు తెలిసి ఈరోజు నాకు ఏదో ప్రమాదం జరగాల్సి ఉందొ ఏమో, కానీ సాయినాధుడు నాకు ఏమి జరగకుండా కాపాడినాడు.. ఎందుకంటె దారి లొ చాలా సార్లు వాహనాలు చాలా దగ్గరిదాకా వచ్చి చివరి second లొ తగలకుండా వెళ్లాయి.
మనకి ఏ చిన్న కష్టం, ఇబ్బంది వచ్చినా సాయి మనల్ని కాపాడట్లేదు అని మనం అనుకుంటాం, కానీ మన చుట్టూ వున్న సాయి రక్షణ వలయం ని గుర్తించము. చిన్న చిన్న సమస్య లు, ఇబ్బందులకు కారణం మన కర్మ అయి ఉంటుందేమో అని ఆలోచించక సాయి ని నిందిస్తుంటాము, అప్పటిదాకా చేస్తోన్న సాయి స్మరణ మాని అశాంతి కి మనసులో ఆశ్రయం కలిగిస్తాం. అపుడే సహనం, సాయి పైన విశ్వాసం అవసరం.. మనం ఇంకా ఇలా వున్నాము అంటే సాయినాధుడి దయ అని తెలుసుకుని, సాయి పాదాలకి కృతజ్ఞతా సుమాలని నిరంతరం సమర్పించుకుందాం..
