ఓం శ్రీ సాయినాథాయ నమః

పేరు వెల్లడి చేయని ఒక సాయి భక్తురాలి అనుభవం తన మాటల్లో..
“సాయి బంధువులందరికీ నమస్కారం.. సాయి తో జరిగిన నా అనుభవాలని బ్లాగ్ లొ ఇది వరకు పంచుకున్నాను. మరికొన్ని అనుభవాలు..మా అమ్మాయి కి కొంత కాలం క్రితం థైరాయిడ్ తో బాధ పడేది. నేను మా గృహ దైవం సాయి నాధుడికి మొక్కుకున్నాను, నా బిడ్డ కి థైరాయిడ్ లేకుండా చేయు తండ్రీ! నా బిడ్డ నీ గుడికి 5 వారాలు 108 సార్లు ప్రదక్షిణ చేస్తుంది ” అని.4వారాలు ప్రదక్షిణ చేసిన తర్వాత test చెపిస్తే లేదు అని తెలిసింది.అంతా ఆ సాయి తండ్రి దయ. ఇంకో అనుభవం మాకు ఒకరి దగ్గర నుండి డబ్బు తిరిగి రావాల్సి వుంది. నేను భక్తి గా సాయి లీలామృతం సప్తహ పారాయణం చేశాను. ఆశ్చర్యం గా నా పారాయణం ముగిసే రోజే నా డబ్బు నాకు వచ్చింది.అంతా సాయి దయ. బాబా, ఎల్లప్పుడూ నీ దయ మా కుటుంబం పైన ఇలాగే ఉండాలి తండ్రీ. అలాగే సాయి తన భక్తులందరినీ ఇలాగే కాపాడాలి అని ఆశిస్తున్నాను “
