సాయి వాణి :విశ్వాసం తో నన్ను నమ్ము. నిన్ను అన్ని వైపుల నుండి రక్షించేదను . నాపై నమ్మకం కలవారికి జయము కలుగును.

ఈగ రూపంలోవచ్చి తోడుగా నేనున్నానని బాబా ఇచ్చిన అభయము

ఓం శ్రీ సాయినాధాయ నమఃIMG_20200413_220626

సాయి కరుణ ని ఏమని వర్ణించను. ఎవరిపైనైనా సాయి కృపా దృష్టి పడింది అనుకోండి, ఆ అనుగ్రహ జల్లులలో మనము పూర్తిగా తడిసి ముద్దయి పోవాల్సిందే. సాయి ప్రేమకు అంతు లేదు.

నేను కొన్ని సమస్యల వలన గత కొన్ని రోజులుగా అశాంతి ఆందోళన తో ఉంటున్నాను. ఈ మధ్య కొత్తగా ఒక కొత్త బాధ్యత కూడా నిర్వహించబోతున్నాను. అయితే ఆ బాధ్యత సక్రమంగా నిర్వహించగలనో లేదో అన్నీ సక్రమంగా జరుగుతాయో లేదో అనే కంగారు గత కొన్ని రోజులు గా నాలో ఉంటోంది. బాబా ప్రతిరోజూ నా కంగారు గమనిస్తూనే ఉన్నాడు. బాబా ఇక నా బాధ చూడలేక పోయాడు ఏమో, ఈ రోజు ప్రత్యేకంగా తన అభయాన్ని నాకు ఎడతెరపి లేకుండా అందిస్తూనే ఉన్నాడు.

నా బాధ్యత నిమిత్తం మా అమ్మాయి దగ్గరికి ప్రయాణానికి నేను మంచం పై కూర్చుని ఏర్పాట్లు చేసుకుంటూ మధ్య మధ్యలో ఫేస్ బుక్ లోని పోస్ట్ లు చూస్తూ పని చేసుకుంటున్నాను.. ఫేస్బుక్ ఓపెన్ చేసిన ప్రతిసారీ మొట్ట మొదటి పోస్ట్ బాబా పలికిన వివిధ అభయ వాక్యాలే కనిపిస్తూ నన్ను ఆశ్చర్య పరిచాయి. అది కూడా సుమారు 20 సార్లు ఓపెన్ చేస్తే ఆ 20 సార్లు మొట్టమొదట,  బాబా  పలికిన అభయ వాక్యమే దర్శనమిస్తోంది .   అది కూడా నా ప్రస్తుత పరిస్థితికి తగిన విధంగా బాబా నాకు అభయ వాక్యాలు ఇస్తున్నట్టుగా ఆ సందేశాలు ఉన్నాయి.. ఆ అభయ వాక్యాల ద్వారా బాబా నాకు ధైర్యాన్ని ఇస్తున్నటు గా నాకు చాలా ఆనందంగా అనిపించింది.. అలా ఆ బాబా సందేశాలను చూస్తూ ఉండగానే, నేను సర్దుతున్న బట్టల బ్యాగ్ పక్కన ఏదో పురుగు పడినట్టు అలికిడి అయితే అటువైపుగా చూశాను. కానీ అక్కడ ఏమీ లేదు. కొద్దిసేపటికే, గోడకి దిండు పెట్టి వొరిగి  ఉన్న నా వీపు పైభాగం పై ఏదో పురుగు పడినట్టుగా అవుతే పక్కకి జరిగి చూడగా, ఒక చాలా పెద్ద ఈగ నా దిండు మీద కనిపించింది.. అది సుమారు ఒక ఇంచు అంత పెద్దది గా ఉంది. అంత పెద్ద ఈగ నీ చూడటము నాకు అదే మొదటి సారి..హాలు దాటి లోపల మూలగా వున్న నా రూం లోకి ఈగ ఎలా వచ్చిందో నాకు తెలియదు. కిటికీలు కూడా మూసి ఉన్నాయి. అంటే ఇందాక నిశ్శబ్దంగా వచ్చిన పురుగు లాంటిది ఈ ఈగే అని అర్థమయింది. బాబా అభయ వాక్యాలు నేను వింటున్నంత సేపు అది అక్కడే ఉంది. చివరగా నా వీపు తట్టి నట్లుగా ఆ  మృదువైన స్పర్శ నాకు కొత్తగా అనిపించింది. ఈ ఈగ రూపం లో సాయి వచ్చాడా? అనే ఆలోచన నాలో కలిగింది. వెంటనే మనసులో, “బాబా ఈ రోజంతా నాకు ఫేస్బుక్లో అభయ వాక్యాలు ఇస్తూనే ఉన్నావు.. మరి ఈ ఈగ రూపంలో కూడా నువ్వు వచ్చావా? ఒకవేళ నువ్వు ఈగ రూపంలో వచ్చి ఉన్నట్లయితే, ఈ ఫేస్బుక్ లోనే ‘నేను ఏ రూపం లో నయినా నా భక్తుల దగ్గరికి వస్తాను  ‘  అనే  సందేశం నాకు కనిపించాలి.. అప్పుడు ఈగ రూపంలో వచ్చింది నువ్వే అని నేను అనుకుంటాను. “అని బాబా కి చెప్పాను.. వెంటనే  మరలా ఫేస్బుక్ ఓపెన్ చేయగా మొదటి సందేశం ఇలా ఉందిIMG_20200413_220820. ఆశ్చర్యం!.. నేను అనుకున్నట్టుగానే  ఈ సందేశం ఉంది.    “దేవుడికి తన బిడ్డ ఆందోళనగా ఉందనిి సమస్యల్లో ఉందని తెలుసు..     అందువలననేే భగవంతుడు తనెప్పుడూ తన బిడ్డల పక్కనే ఉంటాడు అని నిరూపించడానికి ఏ రూపంలోనో  వచ్చి సమాధానంం ఇస్తాడు “… అంటే బాబానే ఈగ రూపంలో వచ్చారని మాటే కదా!

ఈ విధంగా ఈగ రూపంలో సాయి ‘నేనుు ఉన్నాను ‘అని  నాకు అభయాన్ని,  మనోధైర్యాన్ని ప్రసాదించాడు. ఈ అద్భుతమైన సాయి ప్రేమ చవిచూసి నేను కొద్దిసేపు భావోద్వేగం లో ఉండిపోయాను.  తన భక్తులు ఆందోళనలో ఉంటే సాయి తట్టుకోలేరు, ఏ రూపంలోనో వచ్చి మనకి ఊరట ని అందించే తీరుతాడు.

జై సాయిరాం!

సాయి నాకు ఫేస్బుక్ లో ఈ రోజు ఇచ్చిన అభయ వాక్యాలు మీ అందరి కోసం. IMG_20200413_220547IMG_20200413_220346IMG_20200413_220417IMG_20200413_220212IMG_20200413_220547IMG_20200413_220510IMG_20200413_220248IMG_20200413_220435IMG_20200413_220145

Leave a Reply

WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Discover more from Sai Sannidhi

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

search previous next tag category expand menu location phone mail time cart zoom edit close