నా అంతర్మధనం – కల లొ సాయి సందేశం

ఓం శ్రీ సాయినాధాయ నమః 

  హే సాయి భవరోగ వినాశకాయ శరణం శరణం 🙏ఇటీవల సాయి తన ఉనికి ని చూయించిన నా అనుభవాన్ని సాయిభక్తులతో పంచుకుంటున్నాను.

     నేను గత 3నెలలుగా నా కాలు కి ఆక్సిడెంట్ లొ  ligament tear అవడం వల్ల doctor సూచన మేరకు bed rest లొ వున్నాను.పాదం రెస్ట్  లొ ఉంచి ఇంత కాలం అవుతున్నా ఇంకా నేను నడవలేక పోతుండటం తో చాలా టెన్షన్ పడ్డాను. మా గురువు గారు Feb 8th కి (పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారు ) ఒక సాయి కార్యక్రమం నిమిత్తం మా ఊరికి కొంచం దగ్గర లొ మరో ఊరికి వస్తున్నారని తెలిసింది. అలా తెలిసిన రోజు రాత్రి,”నాకు త్వరగా తగ్గాలంటే ఇంటర్నెట్ ద్వారా నేను తెలుసుకున్న రెండు మూడు ట్రీట్మెంట్స్  లొ  ఏ విధమయిన  treatment తీసుకోవాలో Feb 8న ఆ ఊరు వెళ్లి గురువు గారిని అడిగి  వారి సలహా ప్రకారం చేయాలి” అని నేను  అనుకున్నాను.మరుసటి ఉదయం నేను నిద్ర మేల్కొంటుండగా ( ఇంకా పూర్తిగా చైతన్యం లొ కి రాలేదు ),నా మస్తీష్కంలో ఒక screen కనిపించింది. Screen పై సమాధి మందిరం లొ కూర్చుని ఉన్నట్లున్న సాయి ఫోటో ,దాని పక్కన message box లా వుంది. నేను ఆ message లొ ఒక్కో పదం వరుసగా  కనిపిస్తోంటే చదువుతూ వున్నాను మనసులోనే ” నా కోసం wait చేయవద్దు.నీ ఆత్మ జ్ఞానం ప్రకారం ముందుకి వెళ్ళుము ” అని ఆ message లొ వుంది.అంటే గురుగారు వచ్చే వరకు ఆగకుండా నా స్వంత జ్ఞానం ప్రకారం వెళ్ళు అని సాయి సలహా ఇచ్చారు అని అర్థం అయ్యి మనసు కుదుట పడింది . (కానీ ఆత్మ జ్ఞానం అంటే ఆత్మ కి సంబంధించిన జ్ఞానం కదా!!అని doubt తో ఆ word పర్యాయపదాలు google లొ చూస్తే “ఆత్మ జ్ఞానం” అంటే “స్వంత జ్ఞానం ” అనే అర్ధం కూడా వుంది ).. 

అలాగే ఈరోజు ఉదయం కూడా “నేను ఎపుడు వాకర్ లేకుండ, ముందటిలా పూర్తి బలం తో ఎప్పుడు నడవగలుగుతాను? ఎప్పుడు పూర్తిగా కాలు  cure అవుతోంది, స్కూల్ లొ తిరిగి join అయ్యాక వాకర్ తో ఎలా maintain చేయాలి ” అని చాలా సేపు మధన పడ్డాను.అంత లొ నా మస్తీష్కం లొ మా గురుగారి ఫోటో కనిపించి “softly move with careful instructions ” అని వాక్యం కూడా కన్పించగా నేను మనసులో చదివాను.అంటే, నేను మధన పడుతూ ఉంటే, సాయి గమనించి  చాలా జాగ్రత్త గా నడువు అని సాయి దేముడు సలహా ఇచ్చారు. Thank you బాబా, దయచేసి ఎల్లప్పుడూ ప్రతి కష్టం లొ నన్ను నడిపించు తండ్రీ 🙏నేను మీరు తప్ప మారేదీ కొరకుండు గాక .

    మన కర్మ బలీయం అయినపుడు సాయినాధుడు మన కర్మ తీవ్రత తగ్గిస్తాడు. మనం ఆదుర్ద పడుతోంటే, మన పక్కన ఉండి మనకు ధైర్యం చెపుతుంటాడు.ఎన్నో రకాలుగా మనకి తగు సలహాలు ఇస్తుంటాడు సాయినాధుడు.కలత తో మనం చేసే ప్రతి ఆలోచన కనిపెడుతూ మన కి సమాధానాలు ఇస్తుంటాడు. పూర్తి భారం సాయి పైనే వేసి, అనన్య శరణాగతి తో సాయి పాదాల వద్ద పడి ఉండడమే మనకి శ్రేయస్కరం.

హే సాయి శరణం శరణం 🙏

Leave a Reply

WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Discover more from Sai Sannidhi

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

search previous next tag category expand menu location phone mail time cart zoom edit close