సాయి వాణి :విశ్వాసం తో నన్ను నమ్ము. నిన్ను అన్ని వైపుల నుండి రక్షించేదను . నాపై నమ్మకం కలవారికి జయము కలుగును.

సాయి స్వరం తో కలిగిన సాంత్వన

ఓం శ్రీ సాయినాథాయ నమః

సాయిబంధువు మయూరి గారికి కలిగిన సాయి అనుభవం వారి మాటల్లో..

“నాకు ఒకరోజు ఉన్నట్లుండి ఎందుకో left side back నొప్పి మొదలయ్యింది. నొప్పి చాలా తీవ్రంగా బాధపెట్టసాగింది. నిద్ర పోయేప్పుడు కూడా ఆ నొప్పి తో చాలా ఇబ్బంది పడ్డాను. సాయిబాబా ని ప్రార్థించాను “బాబా, నా నొప్పి తగ్గించు తండ్రీ ” అని. నాకు కల లొ బాబా కనిపించడం అలా ఎప్పుడూ జరగలేదు. కానీ అంత బాధ తో ఆర్తి తో నేను బాబా ని ప్రార్థించిన ఆరోజు బాబా స్వరం నాకు వినిపించింది.” నీకు నొప్పి తగ్గిపోతుంది ” అని.ఈ స్వరం వినగానే నాకు చాలా ఆనందం కలిగింది.బాబా నాకు ఇలా అభయ ప్రదానం చేయగానే నా టెన్షన్ తగ్గి బాబా తగ్గిస్తారు అనే నమ్మకం కలిగింది. వెంటనే బాబా విభూతి ని నొప్పి వున్న దగ్గర రాసాను. Spray కూడా చేశాను. ఆశ్చర్యం గా నొప్పి చాలా వరకు తగ్గిపోయింది.

బాబా అంటేనే ఒక ధైర్యం,బాబా ని తలచుకోగానే problems కి solution దొరికిపోతుంది.మనం patience తో ఉండాలి అంతే!!Thank you baba for everything 🙏”

మయూరి గారు బాబా పట్ల ఏర్పరచుకున్న నమ్మకం మనందరిలోనూ కలుగుగాక.మన జీవితం లో ప్రతి విషయం ప్రతి సమస్య బాబా పాదాల చెంత ఉంచి నిశ్చింత గా బ్రతుకుదాం!సాయి సేవలో గడుపుదాం!

Leave a Reply

WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Discover more from Sai Sannidhi

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

search previous next tag category expand menu location phone mail time cart zoom edit close