ఓం శ్రీ సాయినాథాయ నమః

సాయి భక్తురాలు కిరణ్ తన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు
“సాయి బంధువులకి నమస్కారం. నా పేరు కిరణ్, నేను సాయి భక్తురాలిని. నా తండ్రి సాయినాధుడు నన్ను ఎన్నో సార్లు ఆపదలనుండి కాపాడారు.నా తండ్రి సాయి నమ్మిన భక్తులని ఎలా ఆదుకుంటారో ఇది వరకు నేను సాయి సన్నిధి బ్లాగ్ లొ నా అనుభవాలని మీతో పంచుకున్నాను.ఇంకో అనుభవం ఇపుడు మీతో పంచుకోబోతున్నాను. మేము మా వ్యాపారం నిమిత్తం లోన్ కి అప్లై చేశాము.కానీ అంతకు ముందు లోన్ తీసుకోవడం వల్ల మాకు లోన్ రావడం కష్టం అయింది.అపుడు నేను బాబా తో “తండ్రీ నువ్వే దిక్కు. మాకు డబ్బులు చాలా అవసరం.నువ్వే ఎలాగైనా మాకు లోన్ శాంక్షన్ చేయు తండ్రి, మాకు లోన్ శాంక్షన్ అయితే మా అనుభవం సాయి సన్నిధి బ్లాగ్ లొ పంచుకుంటాను ” అని ప్రార్ధించాను.సాయి చమత్కారం చూడండి. అప్పటివరకు లోన్ శాంక్షన్ చేయడానికి విముఖం గా వున్న బ్యాంకు మేనేజర్ మాకు లోన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు.5 లక్షల లోన్ మంజూరు చేసారు. అయితే మాకు మరో పది లక్ష లు అవసరం.. మళ్లీ బాబా తో “బాబా, మాకు ఈ డబ్బులు సరిపోవు.ఎలా” అని బాధ పడ్డాను. బాబా పైన భారం వేసి మరొక బ్యాంకు లొ లోన్ కోసం అప్లై చేసాము. వారు మాకు 8లక్ష లు లోన్ శాంక్షన్ చేసారు. అంతా బాబా దయ. తండ్రీ!నిన్ను నమ్మిన వారిని సదా రక్షించు తండ్రీ, నీ చల్లని చూపులు మా అందరిపై ప్రసరింప చేయు తండ్రీ! నీవే మాకు రక్ష.”
మన సాయి,సంపదలు సౌభాగ్యాల ప్రసాదించే సాక్షాత్తు సౌభాగ్య లక్ష్మి మాత అవతారమే.. తన చల్లని చూపులతో తన ని నమ్ముకున్నవారికి దేనికీ లోటు లేని ధనం ప్రసాదించే భాగ్య విధాత.
ఓం శ్రీ సాయి నాధాయ నమః
